రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 10:53 PM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

- మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
గర్మిళ్ల, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదిన హన్మకొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై దిశానిర్దేశం చేస్తారన్నారు. సభను కార్యకర్త లు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ పెం ట రాజయ్య, లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ న ల్మాస్ కాంతయ్య, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు అంకం నరేశ్, సందెల వెంకటేశ్, పల్లె భూమేశ్, పోగుల రవీందర్‌రెడ్డి, పాల్గొన్నారు.
బెల్లంపల్లి (ఆంధ్రజ్యోతి): ఈ నెల 27న హన్మకొండ జిల్లాలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్నారని నా యకులు, కార్యకర్తలు విజయవంతం చే యాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావే శానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గానికి మూడువేల మంది కార్యకర్తలు తరలిరావాలని సూచించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిన్నర కాలంలోనే అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిపారు. చెన్నూర్, బె ల్లంపల్లి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలు పుకోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, నాయకులు పాల్గొన్నారు.