పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:31 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు.
- డీఈవో యాదయ్య
లక్షెట్టిపేట, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఉర్ధూ మీడియం పాఠశాలను బుధవారం ఆయన అకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థులకు సకల సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. బడీడు పిల్లలు ఎవరూ బయట కనపడకుండా చూడాలని పాఠశాలలో చేర్పించాలని సూచించారు. అందుకు గాను పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం పాఠశాలల్లో కల్పించే వసతులు, పిల్లల భవిశ్యత్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. డీఈవో వెంట క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ప్రధానోపాద్యాయురాలు శోభారాణి, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రుచికరమైన భోజనం అందించకపోతే చర్యలు
దండేపల్లి (ఆంధ్రజ్యోతి): దండేపల్లిలో కసూర్బా గాంధీ విద్యార్థినులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని లేని పక్షంలో సిబ్బందిపై చర్యలు తప్పవని డీఈవో యాదయ్య హెచ్చరించారు. బుధవారం దండేపల్లి కర్ణపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకసిక్మంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం తీరు, సిబ్బ్దంది పని తీరుపై ఆరా తీశారు. విద్యాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, భోజనం సరిగా పెట్టడం లేదని ఫిర్యాదు చేయడంపై కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. విద్యాలయం బోధన సిబ్బంది సమయపాలన పాటించడంలేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని సిబ్బ్దందిని హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టిక, సిబ్బంది రిజిష్టర్లును పరిశీలించారు. వంట సామగ్రిని పరిశీలించి గడువు ముగిసిన సామగ్రి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఈవో దుర్గం చిన్నయ్య ఉన్నారు.