వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:52 PM
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరులో కీలక భూమిక పోషించారన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గౌడ కులస్తులకు కాటమయ్య రక్ష కిట్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం, రజక వృత్తిదారుల సంఘం నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ వంద ఫీట్ల రోడ్డులో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాయకులు సంగం లక్ష్మణ్, సంగెపు ఎల్లయ్య, కొలిపాక రమేష్, శంకర్, శ్రీకాంత్, వంకర్, ప్రభాకర్,మల్లన్న, స్వామి, చంద్రమొగిలి పాల్గొన్నారు.
హాజీపూర్: మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన వేడుకల్లో బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు, అసిస్టెంట్ కమాండెంట్ కాళీదాసు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
దండేపల్లి: మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు పుట్టపాక తిరుపతి, పట్టణ రజక సంఘం అధ్యక్షుడు అల్వాల సత్యం, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు లింగంపల్లి బాపు, నాయకులు సత్యం, వెంకటేష్, రఘ, రమేష్, నవీన్, రమేష్, వినయ్, సాయిప్రశాంత్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: పట్టణంలో జరిగిన కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, రజక సంఘం సభ్యులు మందపల్లి రాజు, చిన్నలింగయ్య, నస్పూరి లింగయ్య, ఆయిల్ల సతన్న, నస్పూరి సత్తన్న, తిరుపతి, మందపల్లి మున్న, శ్రీనివాస్, శంకర్, భీమన్న, రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ ఆరీఫ్, చింత అశోక్‌కుమార్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, నాయకులు అంకగౌడ్, సత్యనారాయణగౌడ్, నాగరాజు, సత్యనారాయణ, ఖలీల్, రాజేష్, సుశీలకుమార్, శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, జైన్ పాల్గొన్నారు.
మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక: సీపీ
మంచిర్యాల క్రైం: మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం కమిషనరే ట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ , ఏఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్‌లు భీమేష్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.