మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:39 PM
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని నిరోధించేం దుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాదక ద్రవ్యాలు వినియో గించడం వల్ల కలిగే నష్టాలను ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, ఇతర పద్దతుల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాల న్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అసాధార ణ ప్రవర్తనను గమనిస్తూ అవసరమైన చర్య లు తీసు కోవాలన్నారు. వ్యవసాయాధికారులు జిల్లాలో గంజాయి సాగు చేయకుండా పటిష్ట మైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాలను అరికట్టే పోస్టర్ల ను విడుదల చేశారు. కార్యక్రమంలో డీసీపీ భాస్క ర్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు.