మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలి
ABN , Publish Date - May 22 , 2025 | 11:11 PM
మహనీయుల చరిత్రను, వారి త్యాగాలను భావితరాలకు అందించాల ని కలెక్టర్ వెంకటే ష్ దోత్రే సూచించారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): మహనీయుల చరిత్రను, వారి త్యాగాలను భావితరాలకు అందించాల ని కలెక్టర్ వెంకటే ష్ దోత్రే సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సీవన్, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేసిన దీనజన బాంధవుడు భాగ్య రెడ్డివర్మ అని అన్నారు. దళిత ఉద్యమ పితామహుడు, సంఘ సంస్క ర్త, దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని, సమాజంలో దళితుల చైతన్యం కోసం విశేష కృషిచేసిన మహనీయుడని అన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఉద్యమించిన మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాల యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి భాగయ్య అని ఎన్నో పోరాటాల ఫలితంగా వర్మ అనే బిరుదు వచ్చిందని అన్నారు. సమాజంలో అందరు సమానమే అని, సమసమజాన నిర్మాణం కోసం పోరాటం చేశారని అన్నారు. అణగారిన, దళితుల అభివృద్దికి విద్యా సంస్థలు నెలకొల్పి వారి జీవితాల్లో విద్యతో వెలుగులు నింపారని కొనియాడారు. జగన్ మిత్ర మండలిని స్థాపించి దళితుల చైతన్యం కోసం పాటు పడ్డారని అన్నారు. దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి కోసం కృషి చేశారని అన్నారు. వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, డీపీవో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంటీవో ఆర్‌ఐ అంజ న్న, డీసీఆర్సీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై లావణ్య, ఆర్‌ఎస్సై రాజేష్, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.
వాంకిడి: భాగ్యరెడ్డి వర్మను ఆదర్శంగా తీసుకొని ముం దుకు సాగాలని భారతీ య బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మౌల్కర్ అన్నారు. వాంకిడి మండల కేం ద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో భాగ్య రెడ్డివర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు శ్యాంరావు, రోషన్, లాహుజీ, బలవంత్, మహేష్, మారుతి, శివాజీ, సంతోష్, నూతన్, రమేష్, యోగు, అన్నారావు, లడ్డు తదితరులు పాల్గొన్నారు.