ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - May 18 , 2025 | 11:32 PM
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు.

ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్
మందమర్రి టౌన్, మే 18 (ఆంఽధ్రజ్యోతి): గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ పట్టణ 11వమహాసభకు ఆయన హాజరయ్యారు. ముందుగా ఆర్ వెంకన్న పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలన్నారు. చర్మ కారుల కోసం ఏర్పాటు చేసిన తోళ్ల పరిశ్రమను ప్రారం భించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలని కోరారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో చాలా మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారన్నారు. ఒక వైపు శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధమని చెప్పి నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. తమ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రజల కోసం చేపడుతున్న పోరాటా లు వివరిస్తూ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల కోసం పనిచేసిన పార్టీ సీపీఐ అని గుర్తుచేశారు. వంద సంవత్సరాల చరిత్రలో ప్రజా పోరాటాల్లో వెనుక బడుగు వేయలేదని పేర్కొన్నారు. నిజాంపాలన నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రాణత్యాగాలు చేశార న్నారు. దొరలు, భూస్వాములకు, దొరల దురహంకా రానికి వ్యతిరేకంగా పోరాడి కార్మికుల హక్కుల కోసం పోరాడిన వీటీ అబ్రహాం స్పూర్తితో ముందుకు సాగు తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సలేంద్ర సత్యనారాయణ, బీమనాధుని సుదర్శన్, బండారి రాజేషం, ఆంథోని దినేష్, ఎలిగేటి వజ్ర, పద్మ, బచ్చల అభిరాం, పట్టణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
శ్రీరాంపూర్: వచ్చే నెల 21, 22 తేదీల్లో మంచి ర్యాలలో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవం తం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అయిన సందర్భంగా శ్రీరాంపూర్‌లోని కటిక దుకాణాల వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ నిరం తరం పేదల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను అర్హులందరికీ ఇవ్వాలని కోరారు. నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంతంలో ఇప్పటివరకు పట్టాలు ఇవ్వనివారికి ప్రభుత్వం పట్టాలు అందించా లని కోరారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు, శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న, సహాయ కార్యదర్శి కొత్తపల్లి మహేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగమూర్తి, నాయకులు లచ్చన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.