సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:13 AM
జన్నారం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభు త్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో 97 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, ఐదుగురికి షాదిముబారక్ చెక్కు లను పంపిణీ చేశారు.

జన్నారం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభు త్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో 97 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, ఐదుగురికి షాదిముబారక్ చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడ పడుచులకు కల్యాణలక్ష్మీ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. సకాలంలో చెక్కులను బ్యాంకులో జమ చేసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముజాఫర్ ఆలీ, సయ్యద్ పసివుల్లా, ఇందయ్య, సతీష్, కరుణాకర్ పాల్గొన్నారు.