చేప పిల్లల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:27 PM
రాష్ట్రంలో నీటి వనరులలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేప పిల్లలు వది లే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశించారు.
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నీటి వనరులలో మత్స్యకారుల సంక్షేమం కోసం చేప పిల్లలు వది లే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచి వాలయం నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమ వారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, మత్స్య శాఖ అదికారులు, కమిటీ ప్రతి నిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని చెరువులు, రిజర్వాయర్‌లలో చేప పిల్లలను వదిలే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదా యంలో వీసీ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా మత్స్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి హా జరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 261 చెరువులు, రిజర్వాయర్‌లు, పెద్ద చెరువులను గుర్తించా మన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని చెరువుల్లో చేప పిల్లల ను వదిలే కార్యక్రమం పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. 30 నుంచి 40 మిల్లీమీటర్ల సైజు గల 66 లక్షల చేపపిల్లలు వదిలే కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు.
నీటి సంరక్షణపై సమీక్ష
జిల్లాలో 2.50 హెక్టర్ల కంటే ఎక్కువ నీరు నిలిచిన ప్రాంతాలను సర్వే చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎం.డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి రెవెన్యూ, నీటి పారుదల, అటవీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ అధికారులతో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నీటి సంరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2.50 హెక్టార్ల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న నీటి వనరులు దాదాపు 150 వరకు ఉన్నాయని వాటిని సర్వే చేసి మ్యాప్‌లు సిద్దం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా వ్యవసాయాధికా రి వెంకటి, నీటి పారుదల వాఖ అధికారి గుణవంతరావు, తదితరులు పాల్గొన్నారు.