అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:20 PM
అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యమని, దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నా రు.
- పారదర్శకతకు మరో పేరు సింగరేణి
- ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు
రెబ్బెన, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అవినీతిని నిర్మూలిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యమని, దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు అన్నా రు. సోమవారం గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతిక పెరిగిపోయిందని ఎదుటి వారితో మాట్లాడే టప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అవినీతి ఏ రంగంలో అయినా అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని ఫలితం దేశ పురోభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అవినీతి లేకుంటే సమాజం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం అవినీతికి వ్యతిరేకంగా నిజాయి తీగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కిరణ్, డీజీఎం ఉజ్వల్‌కు మార్ బెహారా, ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, ఎస్‌వోటు జీఎం రాజమల్లు, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు ఉత్పత్తి లక్ష్యాలపై దృష్టి పెట్టాలి
అధికారులు ఉత్పత్తి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు సూచించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు జీఎం ఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి పర్యటిం చారు. అనంతరం జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి గోలేటి ఉపరితల గని పనుల ప్రగతిని సమీక్షిం చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఉత్పత్తి లక్ష్యాలపై దృష్టి పెట్టా లన్నారు. నిత్యం 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. అనంత రం కైరిగూడ ఓసీ నుంచి పనిస్థలాలను తనిఖీ చేశారు. ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న మహిళా ఉద్యోగులతో మాట్లాడారు. మగ వారితో సమానంగా వారు చేస్తున్న పనులను చూసి అభినందించారు. బ్లాస్టింగ్ పనులు ఎలా చేస్తున్నారో ఉద్యోగులు డైరెక్టర్‌కు వివరించారు. ఇలాగే పనిచేస్తే పదోన్నతులు త్వరగా కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పీవో నరందర్, ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, ఎస్‌ఓటు జీఎం రాజమల్లు, మేనేజర్ శంకర్, తదితరులు ఉన్నారు.