సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:49 PM
విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యా యులు సమష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లా ఇంటర్‌మీడియట్ అధికారి అంజయ్య, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు.
జిల్లా ఇంటర్‌మీడియట్ అధికారి అంజయ్య
బెల్లంపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యా యులు సమష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని జిల్లా ఇంటర్‌మీడియట్ అధికారి అంజయ్య, ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి స్వరూప అధ్యక్షతన మెగా పేరెంట్స్ టీచర్స్‌మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై వారు మాట్లాడారు. మెరుగైన ఫలితాల కోసం కళాశాలల్లో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, తమ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అనంతరం గత విద్యా సంవత్సరంలో ఇంటర్ మీడి యట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు నగదు పురస్కరాంతో పాటు బహుమతులు అందజేసి సన్మానించారు. సమావేశంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాసిపేట: కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలను క్రమంతప్పకుండా కళాశాలకు పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, కళాశాలకు వచ్చి న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దద్దే బాధ్యత అధ్యాపకులపై ఉంటుందన్నారు. అనంతరం కళాశాల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.4.20 లక్షలను పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేసేందుకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకర్, మదర్స్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపఆల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ప్రభుత్వ కళాశాలలో పేరెంట్స్ కమిటీతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల లెక్చరర్లు రామయ్య తదితరులు పాల్గొన్నారు.