Share News

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:03 AM

వరద పరిస్థితుల దృష్య్టా అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉం డాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొ న్నారు.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాల గోదావరి నది తీరం వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం/మంచిర్యాల కలెక్ట రేట్‌: వరద పరిస్థితుల దృష్య్టా అధి కార యంత్రాంగం అప్రమత్తంగా ఉం డాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొ న్నారు. గురువారం మంచిర్యాల పట్ట ణంలోని గోదావరినదితీరం, మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయం తో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గోదావరిలో నీటిప్రవాహం పెరుగుతున్నం దున ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌శాఖల అధికా రులు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సుర క్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసు కోవాలని తెలిపారు. తక్షణ సహా యంకోసం సమీకృతజిల్లా కార్యా లయాల భవన సముదాయంలో కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 08736- 250501 ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఆసుపత్రికివచ్చే ప్రజలకు మెరు గైనవైద్య సేవలందించేం దుకు పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉం టూ ప్రజలకు వైద్యసేవలు అం దించాలని ఆదేశించారు. కలె క్టర్‌ వెంట ఆర్‌ఐ శిరీష, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మాజీ చైర్మన్‌ భానేష్‌, పెంట రజిత ఉన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 01:03 AM