వరద సహాయక చర్యలు చేపట్టండి
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:57 PM
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల జరి గిన నష్టాలపై త్వరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల జరి గిన నష్టాలపై త్వరగా చర్యలు చేపట్టాలని ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మం త్రి మాట్లాడుతూ ఆగస్టులో కురిసిన బారీ వర్షాల వలన జరిగిన ప్రాణ, ఆస్తి, పంట న ష్టాలపై పూర్తి వివరాలతో స్పష్ట మైన నివేదిక అందించాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగం, విద్యుత్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మున్సిపల్, జాతీయ రహదారుల శాఖల పరిధిలో జరిగిన నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నివాస గృహాలు దెబ్బతిన్నాయని, వంతెనలు తెగిపోయాయని, ఎస్‌డీఎఫ్ నిధులతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదే శించారు. అన్ని శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని నివేదిక రూ పంలో అందించాలని తెలిపారు. అన్ని శాఖలు కలుపుకొని ప్రాథమిక అంచనా నష్టం రూ. 4,124 కోట్లు ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకృతి విపత్తుల నిధులు వచ్చే విధంగా అన్ని జిల్లాల నివేదికలను క్రోడీకరించి రాష్ట్రస్థాయి నివేదిక రుపొందించాలని తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలకు సంబంధించి ప్రకృతి విపత్తుల పరిధిలోకి వచ్చే వివరాలతో నివేదిక తయారు చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రకృతి విపత్తులపై తక్షణమే స్పం దించి ప్రజారక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా జిల్లాలో ముగ్గరు మరణించారని, 46 నివాస గృహలు దెబ్బతిన్నాయని, 50 మేకలు మృతి చెందాయని తెలిపారు. 15,000 ఎకరాల్లో పంట నష్టం, 20 పాఠశాలలు, 18 ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, కల్వర్టులు, రహదారులకు నష్టం జరిగినట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వరదల కారణంగా జరిగిన నష్టాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అదికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదిక అంది స్తామని తెలిపారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్దశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఆర్‌డీవో దత్తరావు, ఈఈలు కృష్ణ, గుణవంత్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్‌వో సీతారాం పాల్గొన్నారు.