గుండెపోటుతో తహసీల్దార్ మృతి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:44 PM
నెన్నెల తహసీల్దార్ ముదమల్ల జ్యోతి ప్రియదర్శిని (50) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె స్వస్థలం జగిత్యాల కాగా ఒంటరిగా సీసీసీ నస్పూర్‌లో నివాసం ఉంటు న్నారు.
నెన్నెల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): నెన్నెల తహసీల్దార్ ముదమల్ల జ్యోతి ప్రియదర్శిని (50) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమె స్వస్థలం జగిత్యాల కాగా ఒంటరిగా సీసీసీ నస్పూర్‌లో నివాసం ఉంటు న్నారు. మంగళవారం నెన్నెలలో విధులు ముగించుకొని సీసీసీలోని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి తనకు చాతిలో నొప్పి వస్తోందని ఆసుపత్రికి వెళ్లేందుకు వెంటనే ఇంటికి రావా లని తన కారు డ్రైవర్‌కు ఫోన్‌చేసి చెప్పారు. డ్రైవర్ ఇంటికి వచ్చి చూసే సరికి అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారు. పొరుగువారి సహకారంతో ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. కోటపల్లి, చెన్నూరు మండలాల్లో తహసీల్దార్‌గా, బెల్లం పల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా సేవలదించిన జ్యోతి ప్రియదర్శిని గత నెల 9న బదిలీపై నెన్నెలకు వచ్చారు. అనతి కాలంలోనే ప్రజలు, అధికారుల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. మంగళవారం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు చేసి పెట్టాలని సూచించారు. ఆమె మాట్లాడిన ఆఖరు మాటలను సిబ్బంది మననం చేసుకున్నారు. ప్రజాసేవ కోసం తమ తహసీల్దార్ తపించేవార ని సిబ్బంది పేర్కొన్నారు. అధికారులు, నాయకులు ఆమె పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. జగిత్యాలలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
తహసీల్దార్ మృతికి నివాళి
మంచిర్యాల కలెక్టరేట్: నెన్నెల తహసీల్దార్ జ్యోతి మృతికి బుధవా రం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తహసీల్దార్ జ్యోతి భౌతి కకాయానికి బీఆర్‌ఎస్ నాయకులు నివాలులర్పించారు. పడాల రవి, తిరుపతి, సుబ్బన్న, కుమార్, రాజు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్‌కుమార్, సిబ్బంది సంతాపం తెలిపారు. ఆర్‌ఐ గణపతి, ఆపరేటర్ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.