Share News

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:02 AM

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు విద్యార్థులకు అసౌక ర్యం కలగకుండా చూడాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు విద్యార్థులకు అసౌక ర్యం కలగకుండా చూడాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, వెలుతురు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అత్యవసర సేవలను వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులు పరీక్షా కేంద్రాల కు సకాలంలో చేరుకునేందుకు బస్సులు నడిపిసున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రం ముఖ్య పర్యవేక్షకులతో మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్ల కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలని సూచిం చా రు. ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.

దివ్యాంగులకు యూనిక్‌ డిసేబులిటీ ఐడీ

ఆసిఫాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల కు ప్రస్తుతం అందిస్తున్న సదరం సర్టిఫికేట్‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వం యూనిక్‌ డిసేబులిటీ ఐడీ (యూడీ ఐడీ) అందుబాటులో తీసుకువచ్చిందని కలెక్టర్‌ వెంకటే ష్‌ దోత్రే తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లా పరిషత్‌, జిల్లా సం క్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, దివ్యాంగు ల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు యూనిక్‌ డిసేబులిటీ ఐడీ ఇస్తుం దని ఇప్పటివరకు ఏడు కేటగిరీల్లో సదరం సర్టిఫికేట్‌ అందిస్తుండగా ఇకనుంచి 21 కేటగిరీల్లో సంబంధించి యూనిక్‌ డిసేబులిటి ఐడీ కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ సేవలను వినియోగాని కి మార్చి 1 తేదీ నుంచి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలో ప్రతీ దివ్యాంగుడు కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, సదరం సర్టిఫికేట్‌ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సదరంలో తెలిపిన చిరునామాకు కార్డులు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, అదనపు గ్రామీణాభివృద్ధి అధి కారి రామకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:02 AM