విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:18 AM
జైపూర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి రోజువారీ మెనును అడిగి తెలుసుకున్నారు.

జైపూర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని భోజనశాలను పరిశీలించి రోజువారీ మెనును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంట గదులను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పదవ తరగతి విద్యార్ధినీలకు పరీక్షలా ఎలా రాయాలో మెళకువలు, సూచనలు అందించా రు. కొంత మంది విద్యార్ధినీలను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం పాఠశాల ఆవరణ లో నిర్మిస్తున్న కాలేజీ భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కిష్టాపూర్, నర్వా, రసూల్‌పల్లి, టేకు మట్ల గ్రామాల్లో చేపడుతున్న జాతీయ రహదారి పనులను పరిశీలించి పురోగతి నుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీవో శ్రీపతి బాపురావు, కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల, రహదారి కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.