Share News

అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:56 PM

Strict action will be taken against encroachment of forest land. అటవీ భూమని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీవో రామ్మోహన్‌ హెచ్చరించారు.

అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు
తాత్కాలిక గుడిసెలను తొలగిస్తున్న అధికారులు

ఎఫ్‌డీవో రామ్మోహన్‌

జన్నారం, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): అటవీ భూమని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీవో రామ్మోహన్‌ హెచ్చరించారు. కవ్వాల్‌టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ ఇంధన్‌పల్లి రేంజ్‌ పరిధిలోగల లోతొర్రె అటవీ బీట్‌లో మూడు నెలలుగా కమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యు), లింగాపూర్‌, జైనూర్‌ మండలాలకు చెందిన ఆదివాసీలు కొందరు కబ్జా చేసి గుడిసెలు వేశారన్నారు. వారిపై అటవీచట్టం కేసులు పెట్టామని ఎఫ్‌డీవో తెలిపారు. శుక్రవారం ఎఫ్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మూడు మండలాలకు చెందిన ఆదివాసులు దట్టమైన అటవి ప్రాంతంలో సుమారు 350 చెట్లను తొలగించారని, మొలకెత్తుతున్న చెట్లను చదును చేశారని వారిపై కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించా మన్నారు. మూడు నెలలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కేసులు తప్పలేదన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుమారు 350 మందికిపైగా సిబ్బంది, లక్షెట్టిపేట రమణమూర్తి సాయంతో పోలీసు సిబ్బందితో తాత్కాలిక గుడిసెలను తొలగించామన్నారు. శాంతిభద్రతలను కాపాడుతూ అటవిని కాపాడుకు న్నామన్నారు. అటవిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. అటవీ భూమిని కబ్జా చేస్తే కేసులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అటవి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 10:56 PM