Share News

ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:06 PM

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారితో కలిసి ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదుల్లో విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, భవనాలు, బెంచీలు, ఇతర ఫర్నీచర్‌, కంప్యూటర్‌, ప్రింటర్‌ కోసం అవసరమైన జాబితాను సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:06 PM