రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:38 PM
రెబ్బెన మండలం గోలేటి పట్టణంలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా అండర్-14, అండర్-19 బాలబాలికల పోటీలను సింగరేణి జీఎం ఎం విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు.
రెబ్బెన, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గోలేటి పట్టణంలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా అండర్-14, అండర్-19 బాలబాలికల పోటీలను సింగరేణి జీఎం ఎం విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా బాలబాలికల టోర్నమెంట్ గోలేటిలో నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఇక్కడ ఎన్నో టోర్నమెంట్‌లు జరుగుతున్నాయని, గోలేటిలో ఎంతో మంది జాతీయ, అంతరాత్జీయ స్థాయి టోర్నమెంట్ ఆడినవారు ఉండడం గర్వకారణమన్నారు. సింగరేణి తరపున క్రీడాకారులకు, స్టేట్ అఫీషియల్స్‌కు క్లబ్‌లో గదులు ఇచ్చామన్నారు. సింగరేణి తరపున అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇక్కడికి రావడం మాకు ఎంతో గర్వ కారణంగా ఉందని, పిల్లలు క్రమశిక్షణతో ఆడి జాతీయ స్థాయిలో పతకాలు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర చైర్మన్ రాజారెడ్డి, భాద్రేషం, ఆర్.నారాయణరెడ్డి, ఆర్.నారాయణరావు, రాజయ్య, జరిపుద్దీన్, భాస్కర్, రామకృష్ణ, మల్లేష్, దినేష్, శ్రీనివాష్‌రావు, వెంకటేశ్వర్లు, మహేందర్‌రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, జగ్గయ్య, చక్రపాణి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.