సిబ్బంది సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:06 PM
వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ అనిత సూచించారు.
- డీఎంహెచ్‌వో అనిత
- వెంకట్రావుపేట పీహెచ్‌సీ తనిఖీ
లక్షెట్టిపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆమె అకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్‌లో రోజువారీగా ఆరోగ్య వివరాలు పొందుపర్చాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉప కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలపై అవగాహన కల్పిస్తూ వ్యాధులు ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అసంక్రమణ వల్ల వచ్చే వ్యాధులు, డయాబెటీస్, క్యాన్సర్‌తో పాటు ఇతర జీవనశైలితో వచ్చే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పడేలా చూడాలన్నారు. అంతేకాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని రకాల వ్యాక్సిన్‌లు కూడా ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్, వైద్య సిబ్బంది ఉన్నారు.