Share News

అక్టోబరు 2వ వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:10 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అక్టోబరు 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

అక్టోబరు 2వ  వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు
చెన్నూరు ఆసుపత్రిలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అక్టోబరు 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం స్వశక్తి నారి శశక్తి పరివార్‌లో భాగంగా చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన స్ర్తీ, శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 2 వరకు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించి మహిళలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి, ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరాల్లో మహిళలు, యువతులు, పిల్లల కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సరైన పౌష్టికాహారం తీసుకోవడంపై అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, వైద్య విధాన పరిషత్‌ పర్యవేక్షకుడు కోటేశ్వర్‌, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, వైద్యులు సత్యనారాయణ, ప్రసాద్‌, కృపాబాయి, భీష్మ, శ్రీధర్‌, సుధాకర్‌నాయక్‌, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:10 PM