Share News

భూభారతితో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - May 06 , 2025 | 12:24 AM

భూ భారతి చట్టంలో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పైలెట్‌ మండలంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ అన్నారు.

భూభారతితో సమస్యల పరిష్కారం
ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

భీమారం, మే 5 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టంలో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పైలెట్‌ మండలంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ అన్నారు. సోమవారం భీమా రం మండలం ఆరేపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బూరుగుపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యా లయంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ సదానందంతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన రెవెన్యూ సదస్సుల్లో ఆర్జీదారుల నుంచి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు నియమిం చిన బృందాల ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామసభలు నిర్వహించి నిర్ణీత నమూనాలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గ్రామసభకు 2 రోజుల ముందే గ్రామాల్లో ప్రజలందరికి తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. పెండింగ్‌ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. దరఖాస్తు దారులకు మండల పరిషత్‌ కా ర్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని, దరఖాస్తులు స్వీకరించి రశీదు జారీ చేయ డంతో పాటు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చి న దరఖాస్తులు తీసుకునే చర్యలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఆరే పల్లి గ్రామంలో పర్యటించి తాగునీటి వనరులు, ప్రజలకు నీరు అందుతున్న తీరును పరిశీలిం చారు. వేసవి అయినందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం నీటిని సరఫ రా చేయాలని సూచించారు. గ్రామంలోని కొన్ని ఇండ్లకు తాగునీరు రావడం లేదని పలువురు మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:24 AM