పెన్షన్‌తోనే సామాజిక భద్రత
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:33 PM
పెన్షన్‌తోనే సామాజిక భద్రత కలుగుతుందని, రోజువారీ కనీస అవసరాలను తీర్చేందుకు సామాజిక భధ్రత పథకం అమలు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : పెన్షన్‌తోనే సామాజిక భద్రత కలుగుతుందని, రోజువారీ కనీస అవసరాలను తీర్చేందుకు సామాజిక భధ్రత పథకం అమలు చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన చేయూత పెన్షన్లపై అవగాహన కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని వృద్ధులు, దివ్యాం గులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్, ఫైలేరియా రోగులు, వితంతు వులు, దివ్యాంగ నేత కార్మికులు, కల్లుగీత కార్మికులను రక్షించేందుకు కష్టతరమైన జీవితాన్ని గడుపుతున్న బీడీ కార్మికులు, ఒంటరి మహి ళల అవసరాలు తీర్చేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అర్హులైన పెన్షన్ లబ్ధిదారుల వివరాలను పోర్టల్‌లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. పెన్షన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. రేషన్ కార్డు దరఖా స్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ అధికారు లు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని పన్నులను వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ సంచాలకులు గోపాల్‌రావు, డీఆర్ డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో గణపతి, అధికారులు పాల్గొన్నారు.