Share News

మహిళల రక్షణ కోసమే షీ టీంలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:17 PM

మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, వేధింపులపై మౌనంగా ఉండవద్దని, ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకనలో తెలిపారు.

మహిళల రక్షణ కోసమే షీ టీంలు
సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

- రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల క్రైం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి) : మహిళలు, యువతుల రక్షణ కోసమే షీటీం ఉందని, వేధింపులపై మౌనంగా ఉండవద్దని, ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకనలో తెలిపారు. మహిళల రక్షణ కోసమే షీటీం పని చేస్తుందని, కమిషనరేట్‌ పరిధిలో రెండు షీటీం బృంధాలు పని చేస్తున్నాయన్నారు. ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, పోక్సో కేసు, గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌, ఆత్మహత్యలు, డ్రగ్స్‌, బాల్య వివాహాలు, మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్య వచ్చినప్పుడు 100కు డయల్‌ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. టీ సేఫ్‌ యాప్‌, మహిళల భద్రత, రక్షణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరుస్తున్నామని వివరించారు. సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, లేదా ఆన్‌లైన్‌ క్యూఆర్‌ కోడ్‌, వాట్సాప్‌ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు. మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్‌ నేరగాళ్లపై కూడా సైబర్‌ షీటీం సమన్వయంతో పని చేస్తున్నాయని, దీని కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు, బాలికలు, విద్యార్ధులు షీటీం సేవలను వినియోగించుకోవాలని కోరారు. మంచిర్యాల జోన్‌ పరిధిలోని వారు 8712659386 నంబర్‌కు ఫోన్‌ద్వారా కానీ, వాట్సాప్‌ ద్వారా కానీ సందేశం పంపిస్తే తక్షణమే పోలీసుల సహాయం అందుతుందని చెప్పారు. షీటీంలకు 69 ఫిర్యాదులు అందగా 12 ఫిర్యాదులు నేరుగా అందాయన్నారు. 57 కేసుల్లో రెడ్‌ హ్యాండె డ్‌గా పట్టుకున్నామన్నారు. రెడ్‌ హ్యాండెడ్‌ కేసుల్లో ఆరు పిట్టి, ఎనిమిది కౌన్సెలింగ్‌లు, 43 హెచ్చరించి కౌన్సెలింగ్‌ నిర్వహించామని వివరించారు. అక్టోబరులో మంచిర్యాల జిల్లాలో 25 అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరులో మంచిర్యాల పరిధిలో 126 హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. పోలీసులు ప్రజల కోసమే పని చేస్తారని, మహిళలు, విద్యార్ధులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - Nov 05 , 2025 | 11:18 PM