Share News

వేతనాలు వెంటనే విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:37 PM

మూడు నెలలు నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బం దులు పడుతున్నామని వెం టనే వేతనాలు విడుదల చే యాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఎం పీడీవో కార్యాలయంలో మం గళవారం వినతిపత్రం అంద జేశారు.

వేతనాలు వెంటనే విడుదల చేయాలి
వినతిపత్రం అందజేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు

చింతలమానేపల్లి, సెప్టెం బరు 23 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలు నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బం దులు పడుతున్నామని వెం టనే వేతనాలు విడుదల చే యాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఎం పీడీవో కార్యాలయంలో మం గళవారం వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విలాస్‌, జె.విలాల్‌, ప్రశాంత్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి: గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ రత్నకుమా రికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద పండగ అయిన దసరా పండగకి సైతం వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అనీల్‌, భుజంగ్‌రావు, స్వామి, సంతోష్‌, రాజు, విజయ్‌, భీంరావు, పాండు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:37 PM