పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మతులు
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:40 PM
మండలంలోని దహెగాం-లగ్గాం రోడ్డు గుంతలు పడడంతో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం మరమ్మతులు చేపట్టారు.
దహెగాం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దహెగాం-లగ్గాం రోడ్డు గుంతలు పడడంతో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం మరమ్మతులు చేపట్టారు. ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం పర్యవేక్షణలో కాగజ్‌నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాక్టర్లు, ఎక్స్‌కావేటర్ సహాయంతో గుంతల్లో మొరం పోసి చదును చేశారు. దీంతో ఈ రహదారి గుండా ప్రయాణించే బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సై విక్రమ్, ఏఎస్సై ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ ఉత్తం, పోలీసులు పాల్గొన్నారు.