రేషన్ నో స్టాక్...
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:25 AM
మంచిర్యాల, మార్చి11 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారు లకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దు కాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నాయి. ప్రతి నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్ షాపుల్లో బి య్యం పోయాల్సి ఉంది. అయితే 12వ తేది వచ్చిన ప్పటికీ ఇంకా దాదాపు 40శాతం మేరక స్టాక్ చేరుకో కపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

మంచిర్యాల, మార్చి11 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారు లకు రేషన్ సరుకులు పంపణీ చేసే చౌక ధరల దు కాణాలు స్టాక్ లేక వెలవెలబోతున్నాయి. ప్రతి నెల ఒకటి నుంచి 15వ తేదీలోపు రేషన్ షాపుల్లో బి య్యం పోయాల్సి ఉంది. అయితే 12వ తేది వచ్చిన ప్పటికీ ఇంకా దాదాపు 40శాతం మేరక స్టాక్ చేరుకో కపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం ఐదు ఎంఎల్‌ఎస్(మండల్ లెవెల్ స్టాకిస్ట్ పాయింట్) గోదాముల ద్వారా 424 చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది.
ఖాళీగా దర్శనమిస్తున్న ఎంఎల్‌ఎస్ పాయింట్లు...
చౌక ధరల దుకాణాలకు రేషన్ బియ్యం సరఫరా చేసే ఎంఎల్‌ఎస్ పాయింట్లు సరిపడా స్టాక్ లేక ఖా ళీగా దర్శనమిస్తున్నాయి. లబ్ధిదారుల అవసరాలకు సరిపడా బియ్యం మరుసటి నెలకు సంబంధించి న డుస్తున్న నెలలో 25వ తేదీలోపు అందుబాటులో ఉం చాలి. స్టాక్ వివరాల సరి చూసుకొని డీలర్లు ఒకట వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. మార్చి నె లకు సంబంధించి మరో మూడు రోజులే గడువు ముగిసి ఉన్నా... ఇప్పటి దాక ఎంఎల్‌ఎస్ పాయిం ట్లకు బియ్యం సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి చేరక పోవడం గమనార్హం. ఎప్పటికప్పుడు బియ్యం నిల్వలను సరి చూసుకొని అవసరం మేరకు తెప్పిం చాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి.
సగ భాగం కొరత...
జిల్లాలోని 424 షాపులకు లబ్ధిదారుల సంఖ్యను బట్టి సగటున ప్రతి నెల 70 క్వింటాళ్ల మేర బియ్యం అవసరం అవుతాయి. అలా జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ షాపులకు సరఫరా చేయ డానికి సుమారు 7 మెట్రిక్ టన్నుల సరుకు సరఫరా జరుగాలి. అయితే ఇప్పటి వరకు అందులో కేవలం సగ భాగం మాత్రమే షాపులకు చేరినట్టు తెలుస్తోం ది. మిగితా స్టాక్ కోసం డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయిం ట్ల వద్ద పడిగాపులు కాసిన ఫలితం ఉండడం లేదు. దీనితో లబ్ధిదారులకు జవాబు చెప్పలేక షాపులను మూసి ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్టాక్ వచ్చినప్పుడల్ల తెరిచి అనంతరం మూసి ఉంచక త ప్పని పరిస్థితులు నెలకొన్నాయని స్వయంగా డీలర్లే చెబుతుండడం గమనార్హం.
తరుచుగా ఇదే తంతు...
గత కొంతకాలంగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదా రులకు సకాలంలో బియ్యం అందని దాఖలాలు ఉ న్నాయి. కొన్ని సార్లు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో స్టాకు ఉన్న స్టేజ్-1, స్టేజ్-2 కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బి య్యం పంపిణీ కావడం లేదు. సరైన సమయంలో లారీలు అందుబాటులో ఉంచకపోవడంతో ఈ పరిస్థి తులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా మరికొన్ని సార్లు అసలు స్టేషన్-1 కాంట్రాక్టర్ వద్దకే పౌర సర ఫరాల శాఖ నుంచి పంపిణీ జరుగడం లేదనే అభి ప్రాయాలు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఏదో తంతు చూపి లబ్ధిదారులను.. షాపుల చుట్టూ తిప్పుకోవడం ఆనవాయితీగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలి యని పరిస్థితులు నెలకొనగా, షాపుల చుట్టూ తిర గాల్సిన దుస్థితి లబ్ధిదారులకు పట్టింది.
గడువు పెరిగేనా...?
రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ ఈ నెల 15తో గడువు ముగియనుండగా అధికారులు స్పందించి గ డువు పెంచాల్సిన అవసరం ఉంది. పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం కారణంగా రేషన్ షాపులు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం నిల్వ లేక వెలవెలబోతున్నా యి. అధికారుల తప్పిదానికి లబ్ధిదారులను ఇబ్బందు లు పెట్టకుండా సరిపడా స్టాక్ వచ్చి పంపిణీ పూర్త య్యే వరకు గడువు పెంచాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.