Share News

అర్హులందరికీ రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:44 PM

లక్షెట్టిపేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేష న్‌కార్డు మంజూరు అవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మం గళవారం ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్‌కార్డులను కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

అర్హులందరికీ రేషన్‌ కార్డులు
లబ్దిదారులకు రేషన్‌కార్డు అందజేస్తున్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేటలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ

లక్షెట్టిపేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేష న్‌కార్డు మంజూరు అవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మం గళవారం ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్‌కార్డులను కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో రేషన్‌కార్డులు మంజూరు చేయడంతో చాలా జాప్యం జ రిగిందని కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క టిగా ప్రతీ పథకం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తామన్నారు. ఈకార్డుతో ఒక్కొక్కరికి నెలకు 6కిలోల సన్నబియ్యం అందజేస్తామని లబ్ధిదారులు తీసుకోవాలన్నారు. ప్రతీ సంక్షేమ పథకం నేరుగా అందు తుందని ఎక్కడా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అ నంతరం లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈకార్యక్రమంలో త హసీల్దారర్‌ దిలీప్‌కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి,ఆరీఫ్‌, మం డల అధ్యక్షుడు పింగిళి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, నాయకులు పూర్ణచందర్‌రావు, రాందేని చిన్నవెంకటేష్‌, షాహెద్‌ ఆలీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:44 PM