వర్షపునీటిని ఒడిసి పట్టాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:29 PM
వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తే భావితరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ భూగర్భజల శాస్త్రవేత్త కొల్లి రాంబాబు అన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ భూగర్భజల శాస్త్రవేత్త కొల్లి రాంబాబు
నెన్నెల, జులై 10 (ఆంధ్రజ్యోతి): వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తే భావితరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ భూగర్భజల శాస్త్రవేత్త కొల్లి రాంబాబు అన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం మండలంలో పర్యటించింది. ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్, ఫారంపాండ్, ఊటకుంటలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నీటి సంరక్షణ, పారుదల సామర్థ్యాన్ని ప్రొత్సహించే లక్ష్యంతో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. భూగర్భ జలాల పెంపులో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాల్లో ఇంటికో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని సూచించారు. ఇళ్లలో వాడుకునే నీటిని రోడ్లపైకి వదలకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. మండలంలో చేపట్టిన పనులపై కేంద్ర బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. డీఆర్‌డీఏ నోడల్ ఆఫీసర్ సదానందం, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్, ఉపాధిహామీ టెక్నికల్ సభ్యులు సత్యనారాయణ, మధు, ఇన్‌చార్జి ఎంపీడీవో వీణా, ఏపీవో నరేష్, ఈసీ స్వామి తదితరులు ఉన్నారు.