Share News

గ్రీవెన్స్‌తో విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:28 AM

నెన్నెల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌-2) టెక్నికల్‌, ఫైనాన్స్‌ మెంబర్లు సలంద్ర రామకృష్ణ, లకావత్‌ కిషన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.

గ్రీవెన్స్‌తో విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం
వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు

నెన్నెల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నామని ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్‌-2) టెక్నికల్‌, ఫైనాన్స్‌ మెంబర్లు సలంద్ర రామకృష్ణ, లకావత్‌ కిషన్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో విద్యుత్‌ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ప్రాంతంలోని ఎనిమిది సబ్‌స్టేషన్లలో ఎక్కడ సమస్య వచ్చినా, నాలుగు మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోంతోందని, నెన్నెలలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మించి, అన్నింటికి ప్రత్యేక లైన్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు రాజీపడేది లేదన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటరు ఆగిపోవడం, కాలిపోవడం, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసులు, అదనపులోడు ఇవ్వడంలో నిర్లక్ష్యం, జాప్యం, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యలు, ఓవర్‌లోడ్‌, కాలిపోవడం, తరలించడం, ఎల్‌టీ కేటగిరి, ఫేజ్‌ మార్చడం తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈమొయిల్‌, వాట్సాప్‌ ద్వారా కూడా సీజీఆర్‌ఎఫ్‌కు పిర్యాదు చేయవచ్చని చెప్పారు. సేవలకు గరిష్ట కాలపరిమితులు ఉన్నాయని, ఆలోగా ఫోరం సభ్యులు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. సీజీఆర్‌ఎఫ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఈఈ ఉత్తం జాడే, బెల్లంపల్లి డీఈఈ బానోతు రాజన్న, రూరల్‌ ఏడీఈ రవికుమార్‌, డివిజన్‌లోని ఏఈఈలు, సబ్‌ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:28 AM