Share News

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:25 PM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల ను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారు లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
పతకాలు సాధించిన విద్యార్థులతో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల ను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారు లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. సోమవా రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌జోల్‌తో కలిసి దరఖా స్తులను స్వీకరించారు.

జైనూరు మండలం నందునాయక్‌ తండాకు చెందిన సుజాత తన భర్త మరణించినందు ఆయన పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్‌ చేయాలని అర్జీ సమర్పంచారు. జిల్లా కేంద్రానికి చెందిన సత్యవతి తనకు రేషన కార్డు మంజూరు చేయాలని, దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్‌ తాను గీత కార్మికుడినని లైసెన్స్‌ మంజూరు చేయాలని, తిర్యాణి మండలం చెలిమెల కోలాంగూడకు చెందిన గంగారాం తన పట్టా భూమిని ఇతరులు కబ్జా చేసినందున విచారణ చేసి న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఫర్హీన్‌ సుల్తానా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, సిర్పూర్‌(టి)కి చెందిన అమీనోద్దీన్‌ తాను బోర్‌ మెకానిక్‌ పని చేస్తున్నానని తనకు రావాల్సిన నాలుగు నెలల వేతనం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం జక్కలపల్లి గ్రామస్థులు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆర్జీ పెట్టుకున్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అదికారులు పాల్గొన్నారు.

రిజైండర్లను త్వరగా సమర్పించాలి

దిన పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్త కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ జాస్తిన్‌ జోల్‌, జిల్లా సంబందాల అధికారి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి షూటింగ్‌ బాల్‌ క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్‌ జిల్లాకు బంగారు పతకం సాధించిన సందర్భంగా క్రీడాకారులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అభినందించారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా యువజన క్రీడాధికారి అశ్వక్‌ అహ్మద్‌, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి ఉన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:25 PM