అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం
ABN , Publish Date - May 19 , 2025 | 11:17 PM
సమాజంలో నెలకొన్న అవినీతి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతో ముఖ్యమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ టౌన్‌షిప్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు.

- ఏసీబీ కార్యాలయం ప్రారంభోత్సవంలో డైరెక్టర్ తరుణ్ జోషి
నస్పూర్, మే 19 (ఆంధ్రజ్యోతి): సమాజంలో నెలకొన్న అవినీతి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతో ముఖ్యమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ టౌన్‌షిప్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. హైదరా బాద్ నుంచి రైలు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకున్న తరుణ్ జోషికి ఏసీబీ, పోలీస్ అధికారులు ఘన స్వాగ తం పలికారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తరుణ్ జోషి మాట్లాడారు. మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల కేసుల కు సంబంధించి ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చునన్నారు. నిరంతరం అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఇది వరకు ఆదిలాబాద్‌లో కార్యాలయం ఉన్నందున ఇక్కడి నుంచి వచ్చే ఫిర్యాదు దారులు ఇబ్బందులు పడ్డారని, అంతేగాకుండా కేసుల పరిశోధనలో అధికా రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు కలిపి ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటందన్నారు. ఎవరైన లంచం అడిగితే వారిపై వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని తరుణ్ జోషి సూచించారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంద న్నారు. దీంతో పాటు వెబ్ సైట్‌లో కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామన్నారు. బాధితులు కాల్ చేసిన వెంటనే రికార్డు చేసుకొని కేసును పరిశీలి స్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాదేశ్యాం మురళి, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, కరీంనగర్ ఏసీబీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి, మంచిర్యాల, కరీంనగర్ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమూర్తి, సీఐలు కిరణ్‌కుమార్, క్రిష్ణకుమార్, ఏసీబీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.