Share News

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:40 AM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగజ్‌నగర్‌ భట్టుపల్లి గ్రా మానికి చెందిన చాపిడి మీరాబాయి తనకు జారీ చేసిన పెన్షన్‌ పుస్తకంలో ఆధార్‌నంబరు సరిచేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్‌ మండలం దశ్నాపూర్‌ గ్రామానికి చెందిన దస్నాబాయి తనకు వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించాలని అర్జీ సమర్పించారు. బెజ్జూరు మండలం సల్గుపల్లికి చెందిన కమల తన భర్త చనిపోయినట్టు తనకు పెన్షన్‌ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన లక్ష్మి తాము ఉపాఽధి పనులు చేశామని సంబంధిత కూలి డబ్బులు ఇప్పించాలని అర్జీ పెట్టుకున్నారు. వాంకిడి మండలానికి చెందిన సునిత చౌదరి ఎస్సీ వసతి గృహంలో వంట మనిషిగా పని చేసినట్టు, తనను ఉద్యోగం నుంచి తొలగించారని తిరిగి తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బంక పోశం తన పట్టాపాస్‌ పుస్తకం పోయిందని కొత్త పాస్‌ పుస్తకం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూరు మండలం స ల్గుపల్లి గ్రామానికి చెందిన కమలాబాయి తన భర్త అనార్యోగంతో మృతి చెందారని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పించాలని దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చి న ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీ లించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. కార్య క్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కోలాంగుడకు రోడ్డు నిర్మించండి..

వాంకిడి (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలంలోని ఎనోలి కోలాంగుడ గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎనోలి కోలాంగుడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు దెబ్బతిని కాలినడకన నడవ లేని సరిస్థితి తయారైందని గ్రామస్థులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రానికి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ప్రజలు పేర్కొన్నారు. ఎనోలికోలాంగుడ గ్రామానికి పీవీటీజీ నిధులతో రోడ్డు మంజూరు అయినప్పటికి నేటి వరకు రోడ్డు పనులు ప్రారంభించలేదన్నారు. గ్రామంలో మిషన్‌భగీరథ ద్వారా సక్రమంగా నీరు రావడంలేదని దీంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్న రోడ్డును మరమ్మతులు చేసి మంజూరైన రోడ్డు పనులను సత్వరమే ప్రారంభించి సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ బాధ్యులు దుర్గం దినకర్‌, కార్తిక్‌, వీటీడీఏ ఉపాధ్యక్షుడు సీడాం పగ్గు, మాజీ సర్పంచు కోట్రంగే బాబురావు, గ్రామ పటేల్‌ పోచయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:40 AM