ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:43 PM
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు.
కుమరం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లి గ్రామానికి చెందిన చాపిడి మీరాబాయి తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబరు సరిచేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తమ గ్రామంలోని చాలా మంది వృద్ధులకు పెన్షన్ రావడంలేదని మంజూరు చేయాలని కోరుతూ జైనూరు మండలం బుసిమెట్ట క్యాంపు గ్రామస్థులు ఆర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ మండలం జంబుగ గ్రామానికి చెందిన డోంగ్రి రాంబాయి తమ తండ్రి పేరిట గల భూమిని వారసులైన తమకు తెలపకుండా కొంత మంది పట్టా చేసుకున్నారని పట్టాను రద్దు చేయాలని దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లే సత్తయ్య జాతీయ రహదారి నుంచి కొండపల్లి వరకు గల రహదారిని మరమ్మతులు చేయాలని అర్జీ సమర్పించారు. ఆసిపాబాద్ పట్టణం జన్కాపూర్‌కు చెందిన రమేష్ అనే దివ్యాంగుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆర్జీ సమర్పించారు. పట్టణంలోని జన్కాపూర్‌కు చెందిన జాదవ్ రోహిణి వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రా ల(ఈవీఎం) భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాంలను త్రైమాసిక తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ డేవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిశీలించారు. కార్యక్రమంలో సంబందిత అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): తపాలాశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పోస్టల్‌శాఖ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల సేవలను పొందే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ జోషి, ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టం రెవె న్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో భూభారతి పోర్టల్ ద్వారా ఐదువేల వరకు దరఖా స్తులు వచ్చాయన్నారు. ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. 10 రోజుల్లోగా 100 శాతం దరఖాస్తులను పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, ఆర్డీవో లో కేశ్వర్‌రావు, భూకొలతల అధికారి సోమేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.