Share News

నాణ్యమైన సరుకులు అందించాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:40 PM

వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించడానికి కృషిచేయాలని ఫుడ్‌ సెఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా శిక్షకురాలు కంచాల భార్గవి తెలిపారు.

నాణ్యమైన సరుకులు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఫుడ్‌ సెఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా శిక్షకురాలు కంచాల భార్గవి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నాణ్యమైన సరుకులు అందించడానికి కృషిచేయాలని ఫుడ్‌ సెఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా శిక్షకురాలు కంచాల భార్గవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హలులో దుకాణదారులకు, హోటల్‌ నిర్వహకులకు ఎంసీఈడీ(మహరాష్ట్ర సెంటర్‌ ఆఫ్‌ అంత్ర పెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌) ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులపై అవగాహన పెంచుకొని వ్యాపార దారులు వినియోగదారులకు వాటిని అందించేలా ప్రయత్నం చేయలన్నారు. వ్యాపార సముదాయలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని హోటల్‌ నిర్వహకులు ఆహర పదార్థలలో ఫుడ్‌ కలర్స్‌ టెస్టింగ్‌ సాల్ట్‌ వినియోగించకూడదన్నారు. మంచినూనెను మూడుసార్ల కంటే ఎక్కువగా వేడి చేస్తే క్యాన్సర్‌ కారకమవుతుందన్నారు. ఆహర భద్రత ప్రమాణాల చట్టం 2006 తప్పని సరిగా పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఎంసీఈడీ జిల్లా కో అర్డినేటర్‌ అచ్యుత్‌ కుమార్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్లు శ్రీనివాస్‌, మహేందర్‌రెడ్డి సభ్యులు మహేష్‌, విజయ్‌కుమార్‌, బానుచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:40 PM