Share News

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:59 PM

: పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని జిల్లా విద్యాధికారి ఎస్‌ యాదయ్య సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
వెల్గనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని విద్యార్థుల ప్రతిభను పరిశీలిస్తున్న డీఈవో యాదయ్య

డీఈవో ఎస్‌ యాదయ్య

దండేపల్లి నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని జిల్లా విద్యాధికారి ఎస్‌ యాదయ్య సూచించారు. దండేపల్లి మండలం వెల్గనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఉదయం వేళలో విద్యార్థులకు అందించే రాగిజావా పంపిణీ తీరును పరిశీలించారు. ఆనంతరం తరగతి గదికి వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అందించే విద్యాబోధన తీరును పరిశీలించి, వారి ప్రతిభ సామర్థ్యాలను పరిశీలించారు. ఎస్‌ఏ1 పరీక్షలో వచ్చిన మార్కుల తీరు నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ టెన్త్‌ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అలందించాలన్నారు. ముందుగా మధ్యాహ్న భోజనశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల హజరుపట్టిక, ఉపాధ్యాయుల విద్యాబోధన తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 10:59 PM