విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:13 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వంటశాల, భోజన నాణ్యత, విద్యాబో ధన విధానం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అర్థ మయ్యే రీతిలో గుణాత్మక విద్యను బోధిం చాలని ముఖ్యంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. వచ్చే నెల నాటికి విద్యా ర్థుల్లో అభ్యసన సామర్థ్యాల పురోగతి లేకుంటే ఉపాధ్యా యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందించాలి
ఆసిఫాబాద్ (ఆంధ్రజ్యోతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు జిల్లాలో అర్హులైన గిరిజనులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో దర్తీ అభజన జాతీయ గ్రామీణ ఉత్సక్ష అభియాన్‌లో ఆదికర్మ యోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్థాయి మాస్టర్ టైనర్లకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
పండగనుల ప్రజలందరు సమన్వయంతో శాంతియు తంగా జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి గణపతి నవరాత్రులు, మిలాద్ ఉన్ నబి వేడుకల నిర్వ హణపై పోలీసు, రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, మసీద్ కమిటీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.