రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:25 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. గురువారం తాండూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో సందర్శించారు. రిజిష్టర్‌లను తనిఖీ చేశారు.
డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్
తాండూర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. గురువారం తాండూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో సందర్శించారు. రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. వైద్య సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్‌ను సందర్శించి మందులు, పరికరాలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలను చేయాలని, ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పాము,కుక్క కాటు మొదలైన వాటి మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతీగ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతి ఆశా కార్యకర్త వద్ద మందులు ఉండాలన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్‌పోర్టు సరిగ్గా లేని గ్రామాల్లో డెలివరీలకు దగ్గరగా ఉన్న గర్భిణులను తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
వేమనపల్లి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ సూచించారు. గురువారం వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రోగ్రాం ఆఫీసర్ కృపాబాయి, స్ధానిక వైద్య సిబ్బంది ఉన్నారు.