Share News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:41 PM

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
జైపూర్‌ కేజీబీవీలో భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జైపూర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గంగిపెల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను, ఆసుపత్రికి వెళ్లే రహదారులను పరిశీలించారు. పల్లె దవాఖానాకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రిజిష్టర్‌లు, మందుల నిల్వలు, వార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రావ్య, కేజీబీవో ఎస్‌వో ఫణిబాల పాల్గొన్నారు.

- యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లాలో కొనసాగుతున్న వ్యవసాయ సాగుకు అనుగుణంగా సకాలంలో యూరియా, ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా, ఎరువులు నిల్వల సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కార్యచరణ ప్రకారం సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి చాత్రు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- ఇన్‌ఫ్లో ఎప్పకప్పుడు పర్యవేక్షించాలి

హాజీపూర్‌: మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటి పరిస్థితిని పరిశీలించారు. ఈసందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - Sep 03 , 2025 | 11:41 PM