రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:25 PM
రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని భారతీ య జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబె ల్లి పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని భారతీ య జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబె ల్లి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించు కుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, నాయకులు దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, కృష్ణమూర్తి, శ్రీధర్, అమిరిశెట్టి రాజ్‌కు మార్, శ్రీశైలం, జయరామరావు, మురళీ, చక్రవర్తి, సత్యనారాయణ, పౌలు తదితరులు పాల్గొన్నారు.
- కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటా నికి జిల్లా షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ ఉపసం చాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస రావు, డీఆర్‌డీవో కిషన్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, డీఎంహెచ్‌వో అనిత, జిల్లా మైనార్టీ అధికారి రాజేశ్వరి, అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల క్రైం: మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో సంవిదాన్ దివాస్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో అద్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, ప్రోగ్రాం చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్ సాంబయ్య, పాల్గొన్నారు. బీఎస్పీ ఆధ్వ ర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు రాజేంద్రప్రసాద్, కాదాసు రవిందర్, శ్రీనివాస్, కిరణ్‌బాబు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వ ర్యంలో జరిగిన వేడుకల్లో సంఘం మండల అద్యక్షుడు ముల్కల్ల రాందాస్, సభ్యులు లింగయ్య, సాగర్, మేకల బానేష్, జంగు, నవీన్, రమేష్, దిలీప్ పాల్గొన్నారు.
కాసిపేట: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో షేక్ సప్దర్‌ఆలీ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం: మండలంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్కల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మువ్వన్నెల జెండాతో రాజ్యాంగ పీఠికను పఠించారు.