బిల్లులు రాక ఇబ్బందులు
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:02 AM
జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఆరునెలలుగా బిల్లులు మంజూరుకావడం లేదు. దీంతో వార్డెన్లు తీవ్ర ఒత్తిడికి గుర వుతున్నారు.
- తీవ్ర ఒత్తిడిలో హాస్టల్ వార్డెన్లు
- విద్యార్థుల సంఖ్యలో వ్యత్యాసాలు ఉండడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం
మంచిర్యాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఆరునెలలుగా బిల్లులు మంజూరుకావడం లేదు. దీంతో వార్డెన్లు తీవ్ర ఒత్తిడికి గుర వుతున్నారు. హాస్టళ్లలో రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు వాస్తవసంఖ్య సరిపోకపోవడంతో బిల్లులు మంజూరు చేయ డం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వవసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ అమలు చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడానికి వార్డెన్లు ముందుగా తమ డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. అనంతరం బడ్జెట్ మం జూరుకోసం పైఅధికారికి ప్రతిపాదిస్తారు. దాన్ని ఆ అధికారి జిల్లాస్థాయి ఉన్నతాధికారికి పంపడం ద్వారా బిల్లులు మం జూరు చేయాల్సి ఉంటుంది. రెండురోజుల క్రితం లక్షెట్టిపేట సోషల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్ ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారుల వేధిం పులు, బిల్లులు రాకపోవడంతోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ సంవత్సరం లక్షెట్టిపేట హాస్టల్లో విద్యార్థుల సంఖ్య 250కి పెరిగింది. ఈ విషయమై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ఓ అధికారి బిల్లులు మంజూ రు చేయలేదని తెలిసింది. సదరు అధికారి విఽఽధులకు సక్రమంగా హాజరుకావడంలేదని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఈనెల 16రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 17న సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్షితిజకు ఫిర్యాదు చేశారు.
ఆందోళనకరంగా వార్డెన్ ఆరోగ్యం...
ఈ నెల 18న యాసిడ్‌తాగి ఆత్మహత్యాయత్నం చేసిన లక్షెట్టిపేట ఎస్సీహాస్టల్ వార్డెన్ రాజగోపాల్ ఆరోగ్యం ఆందో ళనకంగా ఉంది. ప్రస్తుతం ఆయన నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్...
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. జిల్లాలో 25 ఎస్సీ, 15 బీసీ, 35 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి మెనూ అమలు చేసేందుకు రోజుకు ఒక్కొక్కరికి పోస్ట్ మెట్రిక్ వారికి రూ. 70, ప్రీ మెట్రిక్ వారికి రూ. 51 ఖర్చు అవుతోంది. ఈ ఖర్చులన్నీ ప్రస్తుతం వార్డెన్లు వెచ్చిస్తున్నారు. ఆరు నెలలుగా బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పులు తెచ్చి మరీ హాస్టళ్లను నడిపించాల్సి వస్తోందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరుపుతాం...
లక్షెట్టిపేట ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ రాజగోపాల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం ఇతర వార్డెన్ల ద్వారా తెలిసిందని సోషల్‌వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దురా ్గప్రసాద్ ఆదివారం తెలిపారు. రాజగోపాల్ ప్రస్తుతం నిర్మల్‌లో చికిత్స పొందుతున్నందున ఆయన్ను కలుస్తా నని తెలిపారు. వార్డెన్‌తో మాట్లాడిన తరువాత వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.