వనమహోత్సవానికి సన్నద్ధం
ABN , Publish Date - May 14 , 2025 | 11:47 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.. 11వ విడతలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. వానలు కురవడమే అలస్యం.. మొక్కలు నాటేందుకు డీఆర్‌డీఏ, అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
- నర్సరీల్లో మొక్కలు సిద్ధం
- పకడ్బందీగా చేపట్టేందుకు అధికారుల ప్రణాళికలు
- జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం
ఆసిఫాబాద్: మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.. 11వ విడతలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. వానలు కురవడమే అలస్యం.. మొక్కలు నాటేందుకు డీఆర్‌డీఏ, అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు, రైతులు అడిగిన మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుతో తొమ్మిది విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదో విడతలో వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సారి 11 విడతలో వన మహోత్సవాన్ని ఉత్సహంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో జూలై మొదటివారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఫ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం:
జిల్లాలో 11వ విడత వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 15 మండలాల్లోని 335 గ్రామపంచాయతీల్లో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో అన్ని శాఖలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈసారి డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 40,53,500 మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే అటవీశాఖ, ఇతర శాఖల ఆధ్వర్యంలో మిగితా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఫ 335 నర్సరీలలో మొక్కల పెంపకం:
జిల్లా గ్రామీణాభివృది శాఖ ఆధ్వర్యంలో 335 గ్రామ పంచాయతీల్లో పంచాయతికి ఒకటి చొప్పున మొత్తం 335 నర్సరీలలో 40,53,500 మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలో మండలాలవారీగా నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం జీపీలు(నర్సరీలు) మొక్కల పెంపకం (లక్షల్లో)
ఆసిఫాబాద్ 27 3,26,700
రెబ్బెన 24 2,90,400
తిర్యాణి 29 3,50,900
వాంకిడి 28 3,38,800
కాగజ్‌నగర్ 28 3,38,800
కౌటాల 20 2,42,000
సిర్పూర్(టి) 16 1,93,600
బెజ్జూరు 22 2,66,200
చింతలమానేపల్లి 19 2,29,900
దహెగాం 24 2,90,400
పెంచికల్‌పేట 12 1,45,200
జైనూరు 26 3,14,600
కెరమెరి 31 3,75,100
లింగాపూర్ 14 1,69,400
సిర్పూర్(యూ) 15 1,81,500
---------------------------------------------------------------------------------
మొత్తం 335 40,53,500
----------------------------------------------------------------------------------