Share News

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:23 PM

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
దరఖాస్తులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

- అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి దరఖా స్తులను స్వీకరించారు.

కెరమెరి మండల ధనోరా గ్రామానికి చెందిన బాలు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాల ని అర్జీ సమర్పించారు. కెరమెరి మండలం పిప్పిరి గ్రామానికి చెందిన ఎల్లక్క తాము సాగు చేసిన కం ది, మొక్కజొన్న పంటలు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని, నష్టపరిహారం ఇప్పించాలని కోరు తూ దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ పట్టణాని కి చెందిన అన్వర ఉల్లా హక్‌ తన పేరిట పట్టాగల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. జైనూరు మండలం పానపటార్‌ గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ద రఖాస్తు అందజేశారు. కౌటాల మండల కేంద్రానికి చెందిన ముత్తయ్య మండల కేంద్రంలోని వారసంత లో స్వచ్చభారత్‌ కింద నిర్మించిన మూత్రశాలలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. వాంకిడి మండల కేంద్రానికి చెంది న దుర్గం శ్యాుంరావు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేస్తున్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనకబడిన తరగతుల వారికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబం ధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:23 PM