పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి పదవులు
ABN , Publish Date - May 18 , 2025 | 11:30 PM
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి ప్రాధాన్య క్రమం లో పదవులు అప్పగిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తెలిపారు.

-ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, మే18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి ప్రాధాన్య క్రమం లో పదవులు అప్పగిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాంగోపాల్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకు, కాంగ్రెస్‌పార్టీని నమ్ముకున్న ప్రతి కార్య కర్తకు అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ ఎప్పుడు నిర్లక్ష్యం చేయ దని తగిన ప్రాధాన్యత ప్రకారం పదవులు కల్పిస్తా మని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అర్హులైన వారం దరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మె ల్యే తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయ కులు మండల పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మండల కమి టీ అద్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి పథకం
పేద ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్, సీఎం రిలీఫ్‌ఫండ్ ఓ వరమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల పట్టణం పద్మనా యక ఫంక్షన్‌హాల్‌లో మంచిర్యాల, నస్పూర్, హాజీ పూర్ మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీము బారక్, సీఎం రిలీఫ్‌ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్స రాల్లో చేయని అభివృద్ధిని మంచిర్యాల నియోజక వర్గంలో చేసి చూపించామన్నారు. ఇప్పటి వరకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద 1,935 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను 1,060 మందికి అందజేశామ ని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు అండగా ఉండే ప్రభుత్వమన్నారు. 114 మంది లబ్ధిదారులకు ఒక కోటి 14లక్షల 13వేల 224రూ పాయల చెక్కుల ను అందజేయగా, సీఎంఆర్‌ఎఫ్ 138 మంది లబ్ధిదా రులకు 64,35,200 రూపాయల చెక్కులను అంద జేశారు.
దండేపల్లి: అనారోగ్య సమస్యలతో ప్రైవేటు, కార్పొరే ట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన పేద లకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వరంగా నిలుస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాస గృహంలో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన బుద్దె శంకరయ్యకు మంజూరైన 12,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మండ ల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఆకుల దు ర్గప్రసాద్ ఉన్నారు.