Share News

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:55 PM

పెన్షన్‌ ఉద్యోగులకు భిక్ష కాదని అది హక్కు అని ఉద్యోగ ఉపాధ్యాయుల సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

- జిల్లా కేంద్రంలో ఉద్యోగుల నిరసన

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పెన్షన్‌ ఉద్యోగులకు భిక్ష కాదని అది హక్కు అని ఉద్యోగ ఉపాధ్యాయుల సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ పొందడం ఉద్యోగి హక్కు, అది ప్రభుత్వ దయాధర్మమో, భిక్షనో కాదన్నారు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ధర్నాకు జిల్లా వైద్యాధికారి సీతారాం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శాంతికుమారి, ఉమర్‌ హుస్సేన్‌, ఊశన్న, హేమంత్‌, శ్రీనివాసరావు, తుకారాం, సదాశివ్‌, ఖమర్‌ హుస్సేన్‌, శ్రీపాద, వలిఖాన్‌, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియ న్‌ పిలుపుమేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:55 PM