Share News

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:48 PM

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
భీమారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

భీమారం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం భీమారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యరంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అన్ని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్యసేవలు అందిస్తోందన్నారు. సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతంర మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:48 PM