కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:46 PM
గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మి కులు బుధవారం ధర్నా నిర్వహించారు.
నస్పూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మి కులు బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందుగా ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా చేరుకున్నారు. ధర్నా అనంతరం పంచాయతీ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు అందక కార్మికులకు పండగ పూట ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సీఐటీయు నాయకులు దుంపల రంజిత్‌కుమార్, సంకె రవి, గోమాస ప్రకాష్, చల్లూరి దేవరాజ్, అంబటి లక్ష్మణ్, సాగర్, సుధాకర్, పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు యశోధ, లత, నాయకులు పోసవ్వ, లింగన్న తదితరులు పాల్గొన్నారు.