Share News

మిగిలింది మూడు రోజులే..

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:34 PM

ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) పాలకవర్గాల పదవీ కాలం ఆగస్టు 14తో ముగియనుంది. ఇంకా మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

మిగిలింది మూడు రోజులే..

- 14తో ముగియనున్న పీఏసీఎస్‌ల పదవీ కాలం

- రెండోసారి రెన్యూవల్‌ కోసం చైర్మన్ల పైరవీలు

- స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయమే కీలకం

- పీఏసీఎస్‌, డీసీసీబీ పాలకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ

వాంకిడి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) పాలకవర్గాల పదవీ కాలం ఆగస్టు 14తో ముగియనుంది. ఇంకా మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో పీఏసీఎస్‌, డీసీసీబీ పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ పరభుత్వ హయాంలో నియమించిన పాలకవర్గాలే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మార్పతో చాలా మంది చైర్మన్లు, డైరెక్టర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77 ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్‌)లు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు మొత్తం 1,001 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు సమయం కూడా ఆగస్టు 14వ తేదీతో ముగిసిపోనుంది.

- ప్రభుత్వ నిర్ణయమే కీలకం...

పీఏసీఎస్‌ల పదవీ కాలం పొడిగింపు విషయంలో ప్రభుత్వ నిర్ణయమే కీలకంగా మారునుంది. ఆగస్టు 14 లోపు గడువు సమయం పొడిగింపుపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆగస్టు 15 నుంచి పీఏసీఎస్‌లతో పాటు డీసీసీబీ పాలకవర్గాలు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. మొదట 2020 ఫిబ్రవరి 15న పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. దీంతో 2025 ఫిబ్రవరి 15తో ఐదేళ్ల పదవీకాలం ముగిసిపోయింది. రాష్ట్ర ప్రభత్వం కొత్తగా అధికారంలోకి రావడం ఆవెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని భావించి మరో ఆరు నెలల పాటు గడువు సమయాన్ని పొడిగించింది. దీంతో ఈ నెల 14తో ఈ గడువు సమయం కూడా ముగిసిపోనుంది. రెండోసారి పొడిగింపు లేకపోతే చైర్మన్లు, డైరెక్టర్ల తమ పదవులు కోల్పోనున్నారు.

- పొడిగింపుపై ఫైరవీలు

డీసీసీబీ, పీఏసీఎస్‌ చైన్మన్లుగా కొనసాగుతున్న చాలా మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో రెండోసారి రెన్యూవల్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌తో పాటు పీఏసీఎస్‌ చైర్మన్లు తమకున్న పరిచయాలు, పలుకుబడితో పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎవరు లేకపోవడంతో పీఏసీఎస్‌ చైర్మన్లకు ప్రొటోకాల్‌ ఉండడంతో ఈ పదవులకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోసారి గడువు సమయాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రభుత్వం కూడా సీఏసీఎస్‌ల పదవీ కాలాన్ని పొడిగించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలోనే స్థానికసంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబరు 30లోగా స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు సొసైటీలను రద్దుచేస్తే స్థానిక ఎన్నికలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం గడువు పొడిగించేందుకు అవకాశం ఎక్కువగా ఉందంటున్నా రు. ఏది ఏమైనప్పుటికీ ఈనెల 14తో గడువు ముగుస్తుండడంతో ప్రభుత్వ నిర్ణయమే కీలకంగా మారనుంది.

Updated Date - Aug 11 , 2025 | 11:34 PM