అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:35 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అదికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అదికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా లకు ఎన్నికల నిర్వహణపై మండల ప్రత్యేక అధికారు లు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్పం చ్, వార్డుసభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 335 గ్రామపంచా యతీలు, 2,874 వార్డు స్థానాలకు మూడు విడతల్లో 87 జోన్‌లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేందార్లను సంద ర్శించి రూట్ మ్యాప్, పోలింగ్ కేంద్రాలలో వసతులు, నెట్‌వర్క్‌పై నివేదికలు ఈ నెల 5వ తేదీలోగా సమర్పిం చాలని ఆదేశించారు. మొదటి విడుత ఎన్నికల్లో భాగం గా ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలకు రిపోర్టు చేసిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు వారికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఎన్నికల సామగ్రి అందజేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాల న్నారు. ఫలితాలు వెలవరించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తిరి గి సిబ్బందిని స్వీకరించిన కేంద్రా లకు తీసుకువచ్చే వరకు బాధ్యతా యుతంగా విదులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, భోజన ఏర్పాట్లు చూడాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు తమ మండలం లో పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజన వసతి, అల్పాహారం ఏర్పాట్ల ను పర్యవేక్షించాలని ఆదేశించారు. నోడల్ అధికారులు ఎన్నికల సామగ్రి సిబ్బందికి శిక్షణ, వాహనాల ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, మండల అధికారులు, నోడల్ అధికారు లు, జోనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.