Share News

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:47 PM

వర్షాల నేపఽథ్యంలో ప్రాణ, ఆస్తి, పశునష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

తాండూర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపఽథ్యంలో ప్రాణ, ఆస్తి, పశునష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. సోమవారం మండలంలోని బోయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ, మండల కేంద్రంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి, నర్సాపూర్‌లోని చెక్‌డ్యామ్‌ల వద్ద పరిస్థితులను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేస్తామన్నారు. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహించే సమయంలో వాహనదారులు వెళ్లవద్దని సూచించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాల న్నారు. తక్షణ సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ 08736- 250501కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 18 (ఆంధ్ర జ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సమ న్వయంతో త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మం దిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదా రుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. ఈ సందర్భంగా నస్పూర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన సుందిళ్ల నరేందర్‌, సుందిళ్ల రాజమ్మ, సుందిల్ల సులో చనలు తమ కుటుంబ పెద్ద పేరిట నస్పూర్‌ శివారులోని భూమిని కొందరు అక్ర మించుకుని బెదిరింపులకు పాల్పడుతు న్నారని, ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి మండలం సుబ్బారావుపల్లి గ్రామానికి చెంది న హనుమాండ్లు 50 సంవత్సరాలుగా తాను టేకుచెట్లు నాటి సంరక్షించానని, వాటిని తొల గించి వ్యవసాయ సాగు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరుతూ దరఖా స్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం కన్నా ల గ్రామ మాజీ సర్పంచ్‌ మంద అనిత తమ గ్రామంలోని ఎర్రకుంట చెరువును కొందరు రియల్‌ ఎస్టేట్‌ వారు ఆక్రమించార ని దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చం ద్రయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 11:47 PM