ప్రశాంతంగా ముగిసిన నీట్
ABN , Publish Date - May 04 , 2025 | 11:33 PM
జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
- పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో వైద్యవిద్య ప్రవేశాల కోసం నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులను పోలీసులు తనిఖీలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చారు. ఈ పరీ క్షకు 287 మందికి గాను 272 మంది హాజరు కాగా 15 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రానికి మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత వచ్చిన ముగ్గురు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అధికారులు అనుమతిం చలేదు. కాగజ్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఆసీఫ్, ఆదిలా బాద్‌కు చెందిన నాగేశ్వరి, దహెగాంనకు చెందిన నిఖిలే ష్‌లు పరీక్ష రాయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించి పరీక్ష తీరును పరిశీలించి అధికారులకు పలు సూచన లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా అన్ని సౌకర్యా లు కల్పించామన్నారు. ప్రశాం త వాతావరణంలో నీట్ పరీక్ష ముగిసిందని తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబుప త్రాలను నిబంధనల ప్రకారం పూర్తి బందోబస్తు మధ్య తర లించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద ఏఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో సీఐ రవీందర్, ఎస్సైలు ప్రశాంత్, అంజన్న, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎస్‌గా అబ్దుల్ రహీమ్, కో అర్డినేట ర్‌గా లక్ష్మినరసింహంలు వ్యవహరించారు.